ప్రియాంక చోప్రా 'సిటాడెల్ 2' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్!

  • ప్రియాంక చోప్రా 'సిటాడెల్' సీజన్ 2 విడుదల తేదీ ఖరారు
  • మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
  • యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్
  • ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ఒకేసారి విడుదల
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ సిరీస్ 'సిటాడెల్' రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రైమ్ వీడియో శుభవార్త చెప్పింది. ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను విడుదల చేస్తూ, 2026 మే 6న అన్ని ఎపిసోడ్లను ఒకేసారి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

"కొత్త టీమ్. కొత్త మిషన్. సిటాడెల్ కొత్త సీజన్. మే 6న కేవలం ప్రైమ్ వీడియోలో" అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. మొదటి సీజన్ కథకు కొనసాగింపుగా సీజన్ 2 ఉండనుంది. శక్తివంతమైన కుటుంబాల అండతో నడిచే మాంటికోర్ అనే సంస్థ చేతిలో నాశనమైన 'సిటాడెల్' అనే గూఢచార సంస్థ ఏజెంట్ల కథే ఇది. మాంటికోర్ నుంచి కొత్త ముప్పు ఎదురవ్వడంతో, మాజీ ఏజెంట్లయిన మేసన్ కేన్ (రిచర్డ్ మ్యాడెన్), నదియా సిన్హ్ (ప్రియాంక చోప్రా), బెర్నార్డ్ ఓర్లిక్ (స్టాన్లీ టుస్సి) మళ్లీ రంగంలోకి దిగుతారు.

ఈసారి మానవాళి భవిష్యత్తును మార్చేసే ఓ కుట్రను ఆపేందుకు, ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏజెంట్లను నియమించుకుని ఒక టీమ్‌ను సిద్ధం చేసే మిషన్‌ను వీరు చేపడతారు. మొదటి సీజన్‌లో కనిపించిన లెస్లీ మ్యాన్‌విల్, యాష్లీ కమింగ్స్ వంటి వారు ఈ సీజన్‌లోనూ కొనసాగనున్నారు. వీరితో పాటు మెర్లే డాండ్రిడ్జ్, గాబ్రియేల్ లియోన్ వంటి కొత్త నటీనటులు కూడా చేరారు. రూసో బ్రదర్స్‌కు చెందిన ఏజీబీవో, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఈ సిరీస్‌ను నిర్మించాయి. డేవిడ్ వెయిల్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.

Priyanka Chopra
Citadel 2
Streaming
Amazon Prime Video
OTT

More Telugu News